పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ఇస్లామాబాద్‌లొ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం తక్షణమేవైదొలగాలని మత పెద్ద మహ్మద్‌ తహిర్‌-ఉల్‌ ఖాద్రి డిమాండ్‌ చేశారు. పాక్‌లో ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పాక్‌ ఉగ్ర వాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోనించారు. ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని ధజమెత్తారు. తప్పుడు తీర్పుతో పాక్‌ ప్రభుత్వం ఏర్పాటైందని, పాక్‌ పరిస్థితి దిగజారిపోయిందన్నారు. పాక్‌ ప్రజలకు మార్పు అవసరమని ఆయన తెలిపారు.