పాతబస్తీతో సహా రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది: సబిత
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం
దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘసస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు
నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ పాతబస్తీతో సహా
రాష్ట్రమంతా ప్రశాంతంగానే ఉందని ఆమె అన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించేందుకు త్వరలో మరిన్ని
నియామకాలు చేపడతామని చెప్పారు. పోలీసు నివాస సముదాయాల మరమ్మతులకు రూ. 30 కోట్లు విదుదల
చేస్తామని తెలియజేశారు.