పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్…
పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ తాహసిల్దార్ కి వినతి పత్రం అందజేత
కేసముద్రం సెప్టెంబర్1 జనం సాక్షి /నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా గురువారం పిఆర్టియు (టీఎస్) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ విద్రోహ రోజును పురస్కరించుకొని కేసముద్రం డిప్యూటీ తా హసిల్దారు కోమల కి మెమోరాండం అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల శాఖ అధ్యక్షులు బీరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2004లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉండడం వలన ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లుతున్నది కావున దీనిని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపాల శ్రీధర్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొత్త జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు బండారు నరేందర్, రవికుమార్, రవీందర్ ,మండల బాధ్యులు నిరంజన్ ,హరినాథ్ , సురేష్ , ఉమామహేశ్వర్, శ్రీనివాస్, రాజు ,భాస్కరరావు , సత్యనారాయణ ,నాగయ్య, కోటేశ్వర్ , హేమలత తదితరులు పాల్గొన్నారు.