పాలమూరులో రోడ్డు ప్రమాదం
పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న వోల్వో బస్సును లారీ ఢీకొట్టింది. తర్వాత లారీని ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో ట్యాంకర్ ముందుభాగం నుజ్జునుజ్జయింది.