పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు ఢీ
హైదరాబాద్: రాజేంద్రనగర్ వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే దిగుతూ పిల్లర్ నెంబర్ 194 వద్ద మూడు కార్లు ఢీకొన్నాయి. వేగంగా ఫ్లైఓవర్ కిందకి దూసుకు వచ్చిన హ్యుందాయ్ ఐ-టెన్ కారు ముందువెళ్తున్న ఇండికాను ఢీకొని పల్టీ కొట్టింది. పడిపోతూ ముందున్న ఇన్నోవా వాహనంపై పడింది. ఈ ప్రమాదంలో కార్లలోని వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో చాలాసేపు రాకపోకలు స్తంభించాయి.