పేదవారికీ ఎననేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌

నల్గొండ : పేదవారికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అని కొనియాడారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రను కోదాడ మండలం ఖానపూర్‌ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉన్నత ఆశయాల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడని కోనియాడాడు. భవిష్యత్‌లో ఎవరూ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు.