పోన్కల్ మండల దీక్ష కు భాజపా నాయకుల మద్దతు. .

 నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్02,జనంసాక్షి,,,  నిర్మల్ జిల్లా పరిధిలోని పొన్కల్ ను మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని చుట్టూ పక్కల పదికి పైగా గ్రామాల ప్రజలు 34 రోజులుగా చేస్తున్న సమ్మెకు నిర్మల్ బీజేపీ నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పోన్కల్ ను మండల కేంద్రంగా  ఏర్పాటు చేసేంతవరకుభారతీయ జనతా పార్టీ   పూర్తి మద్దతు అందిస్తామని అన్ని విధాల వారికి అండగా ఉంటామని తెలిపారు.కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు,   ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్ , కత్తి నరేందర్ , పొడెల్లి గణేష్  భూపతి రెడ్డి మరియు సమ్మె  లో పాల్గొన్న గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.