పౌరుల ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్
ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీ
డిజిటలైజేషన్‌తో సులభమైన వైద్య చికిత్సలకు వీలు
దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చాం
వ్యాక్సినేషన్, కోవిడ్ చికిత్సలో వైద్య సిబ్బంది పాత్ర అమోఘం
ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్‌ను ప్రారంభించి ప్రధాని మోడీ
న్యూఢల్లీి,సెప్టెంబర్27 (జనంసాక్షి) : పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిష్కరిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పథకం కింద ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీని ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక పౌరుడి హెల్త్ రికార్డు డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిం చారు. టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేశవ్యాప్తగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందన్నారు. సాంకేతికంగా బలమైన ప్లాట్‌ఫామ్‌తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందన్నారు. డిజిటల్ మౌళిక సదుపాయాలు ఇండియాలో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని, 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని, 43 కోట్ల మందికి జన్‌ధన్ అకౌంట్లు ఉన్నాయని, ఇలాంటి భారీ డిజిటిల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ ఏ దేశంలోనూ లేదని మోదీ అన్నారు. ఉచిత వ్యాక్సిన్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చామని, దీంతో ఓ రికార్డును క్రియేట్ చేశామన్నారు. టీకాలు తీసుకున్న వారందరికీ సర్టిఫికేట్లు ఇచ్చామని, ఈ ఘనతలో కోవిన్ పోర్టల్ పాత్ర కీలకమైందని మోదీ ప్రశంసించారు. భారతీయ వైద్య ఆరోగ్య రంగంలో కల్పించే సదుపాయాల అంశంలో ఆయుష్మాన్ డిజిటిల్ మిషన్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మోదీ అన్నారు. మూడేళ్ల క్రితం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిచామని, ఇప్పుడు డిజిటల్ మిషన్ ప్రారంభించడం సంతో షంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ వరల్డ్ టూరిజం డే అని, ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే, అప్పుడు టూరిస్టులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారన్నారు. అందుకే హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ పక్రియ వేగంగా జరుగుతోందన్నారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి మోదీ థ్యాంక్స్ చెప్పారు. వ్యాక్సినేషనైనా లేక కోవిడ్ చికిత్స అయినా, వైద్య సిబ్బంది సహాయం వల్లే కరోనా పోరాటంలో భారీ ఊరట దక్కిందన్నారు. ప్రతి భారతీయుడు ఇప్పుడు డిజిటల్ హెల్త్ ఐడిని పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడిని ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్‌లో ఈ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక పౌరుడి హెల్త్ రికార్డు డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని అన్నారు. టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేశవ్యాప్తగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందన్నారు. సాంకేతి కంగా బలమైన ప్లాట్‌ఫామ్‌తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు భారత్‌లో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని, 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని, 43 కోట్ల మందికి జన్‌ధన్
అకౌంట్లు ఉన్నాయని, ఇలాంటి భారీ డిజిటిల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ ఏ దేశంలోనూ లేదని మోడీ అన్నారు. వ్యాక్సినేషనైనా లేక కోవిడ్ చికిత్స అయినా, వైద్య సిబ్బంది సహాయం వల్లే కరోనా పోరాటంలో భారీ ఊరట దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ’ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు.. అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్`డయు, లఢక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలు చేయనున్నారు. దీనికి ముందు, ఈ కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ తెలియజేస్తూ, 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ప్రారంభం కాబోతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ఈ కార్యక్రమం తీసుకు వస్తుందన్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం`జేఏవై) మూడవ వార్షికోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభమవుతుడటం విశేషమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ ఐడీ అందిస్తారు. హెల్త్ అకౌంట్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడి చికిత్స అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా ఈ డిజిటల్ హెల్త్ ప్గ్రొªల్ ఉపయోగపడుతుంది. ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. ‘పౌరులు ఇక నుంచి ఒక క్లిక్‌తో హెల్త్ కేర్ సౌకర్యం పొందగలుగుతాని పీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది.