ప్రజా సేవలలో ముందు నిలిచిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్

మంగపేట,సెప్టెంబర్ 02 (జనంసాక్షి):-
మంగపేట మండలం,రాజుపేట గ్రామంలో నిరు పేద కుటుంబానికి చెందిన కర్రీ చిన్న పుల్లయ్యకు ఆరోగ్యం బాగో లేక నడిచే పరిస్థితి లేక పోవడంతో ట్రస్ట్ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ నాగ రమేష్ వెంటనే స్పందించి సహృదంతో తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం,3000/-నగదును అందజేశారు. అనంతరం రమణక్కపేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చదలవాడ అఖిల్ ను శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ నాగ రమేష్ పరామర్శించి వారికి  మనోధైర్యాన్ని కల్పించి వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 5000/-రూపాయలు అందజేసి తన సేవా భావంను వ్యక్తం చేశారు.ఇలాంటి మంచి మనస్సు,ప్రజల కు సేవా చెయ్యాలనే బావం నూటికి ఒక్కరికే ఉంటుందని పలువురు కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ… అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అలాగే ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు పడుతూ జీవించడం కష్టంగా మారిన నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ను స్థాపించామని నిరుపేద కుటుంబాలకు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ యొక్క సేవలు ఎల్లవేళలా ఉంటాయని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బాడిశ నవీన్,గంగేర్ల రాజరత్నం, పల్లికొండ యాదగిరి,కర్రీ శ్రీను,నిమ్మ గడ్డ ప్రవీణ్,కర్రీ వెంకటేష్,గంగేర్ల నాగరాజు,జానపట్ల విష్ణు,కర్రీ నాగేంద్ర బాబు,గుగ్గిళ్ల సురేష్,బాడిశ ఆదినారాయణ, బొడ ప్రవీణ్,చిట్యాల రాజశేఖర్, చెట్టుపల్లి రామకృష్ణ,కొమరం నితిన్,కర్రీ రామ్మోహన్,బియ్యం శ్రీను,కర్రీ చందు,ఇందారపు రమేష్,గట్టిపల్లి అర్జున్,మడకం రమేష్,తదితర యువకులు పాల్గొన్నారు.