ప్రత్యేక ¬దా పై టిడిపి వెనకడుగు

ఏలూరు,మార్చి25 : విభజన హావిూల మేరకు ఆంధప్రదేశ్‌ రాష్టాన్రికి పదేళ్ల పాటు ప్రత్యేక ¬దా కల్పించాల్సిందేనని వామపక్షనేతలు డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ చేయాల్సిన పనిని తాము చేస్తున్నా ఎందుకు పట్టించుకోరని  సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు చింతకాయల బాబూరావు,సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు మండల నాగేశ్వరరావు లు అన్నారు. ప్రత్యేక ¬దాకు బదులుగా నగదు ప్యాకేజీల ఆలోచనను తిరస్కరించాలన్నారు.  విభజనచట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి నిర్ధిష్టంగా ప్రకటించాలని డిమాండు చేసారు,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇకపై ఏడాదికి రూ.4,000 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విభజనచట్టంలో ప్రకటించిన మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వేజోన్‌, మెట్రోరైళ్ల ప్రాజెక్టులు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాలు అంశాలపై వెంటనే ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. నాలుగేళ్లలో రాష్ట్ర రాజధానిని పూర్తి చేయడానికి నిర్ధిష్టంగా నిధులు కేటాయించాలని కోరారు, విద్యుత్తు ప్లాంట్లు, నీటి ప్రాజెక్టులు, ఇతర ఉమ్మడి ఆస్తుల పంపకాల కోసం శాశ్వతంగా పరిష్కరించే స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని అన్నారు.  ప్రత్యేక¬దా కోసం చేస్తున్న ఉద్యమం అన్నివర్గాల ప్రజలు భావించి అన్ని పార్టీలు సంస్థలు సహకరించాలని అన్నారు. దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపితో అంటకాగుతున్న టిడిపి ఈ విషయంలో ఎందుకు ఒత్తిడి పెంచరని అన్నారు. ఇదిలావుంటే కొత్తగా ఏర్పడిన రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వకపోయినా రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రత్యేక ¬దా సాధనకు రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడాలని ఆ పార్టీ నాయకుడు శివాజీ ఇచ్చిన పిలుపును అంతా ఆహ్వానించాలన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం చేయాల్సిన బాధ్యత బిజెపిదేనని జోగయ్య స్పష్టం చేశారు.