ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అట్లాంటా సంస్థ సాయం
హైదరాబాద్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసి దాతృత్వాన్ని చాటుకుంది. ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలిపెట్టి అమెరికా వెళ్లి స్థిరపడిన వారు పేదవిద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించినా సాయం చేయడానికి ముందు వరసలో అట్లాంటా సంస్థ నిలుస్తోందని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాధమిక విద్యాశాక కమిషనర్ శివశంకర్ తెలియజేశారు.