ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 190 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదువరకు సాగింది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తొలిఓటును వేశారు. పోలింగ్‌ నిమిత్తం విధానసభ ప్రాంగణంలో మూడు కంపార్ట్‌మెంట్లను  ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓటింగ్‌ సరళిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స స్వయంగా పర్యవేక్షించారు. తెదేపా ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డిలె ఓటింగ్‌లో పాల్గొన్నారు.