బంజారా భవన్ ఖమ్మం లో ఉన్నటువంటి జెడ్ పి టిసి మాల్లోత్ కవిత

రఘునాథ పాలెం ఏప్రిల్ 04 (జనం సాక్షి)పత్రిక ప్రకటన ద్వారా గిరిజన భవన నిర్మాణం మరమ్మత్తులు చేపట్టుటకు గిరిజనుల పక్షపాతి గిరిజనుల అభ్యున్నతి కోరుకునే ఒక విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తమ కృషితో .కోటి.(10000000=00 )రూపాయలనిధులను తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరు చేసినందుకు గాను ఖమ్మం జిల్లా గిరిజనుల తరఫున గిరిజన మంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ రాష్ట్రం లోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పించడంలో భాగంగా కృషి చేశారు ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల గ్రామం లను ఎంతో అభివృద్ధి చేస్తు ఉపయోగకరంగా రోడ్లు లింకు రోడ్లు కోసం ఎంతో కృషి చేశారు. విశ్వాసనీయత చిత్తశుద్ధి తో అభివృద్ధి ధ్యేయంగా గిరిజనులకు సమాన అవకాశం కల్పిస్తున్నాడని పేర్కొన్నారు