బస్సులు నిలిపివేయటంతో ఇబ్బందులు
కెరమెరి: జరి గ్రామ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కకు రహదారి సగం వరకు కొట్టుకుపోయింది. దీంతో ముందస్తుగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో ఆదిలాబాద్ వైపు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. మరమ్మతులు చేపట్టేవరకు బస్సులను నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రకటించారు. దీంతో జైనూర్, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు.