బీఆర్‌ఎస్‌తోనే పేదలకు మేలు: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకే గ్రామాలు, పట్టణాలు, తండాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. అభివృద్ధి పథకాలను అమలు చేయడం వల్లే ఇతర పార్టీల వారు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. వచ్చే అసెంబీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌దే గెలుపని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌తోనే పేదలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్టాన్న్రి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.