బొగ్గు గనుల కేటాయింపు సరైనదే: జైశ్వాల్‌

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు సరైనదేనని కేంద్ర బొగ్గుశాఖమంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌ అన్నారు. దీని కంటే ఉత్తమమైన విధానం ఏదీ లేదని ఆయన ప్రభుత్వ విధానాన్ని సమర్థించారు. బొగ్గు గనులను పొందిన సంస్థలు వాటిలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.