భావి తరాలకు స్పూర్తి చాకలి ఐలమ్మ
టీఆర్ఎస్ నాయకులు పెంట లింబద్రి
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 10 ,(జనం సాక్షి ) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని , భావితరాలకు ఆమె స్పూర్తి అని టీఆర్ఎస్ నాయకులు పెంట లింబాద్రి అన్నారు.ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘా సభ్యల ఆద్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ప్రధాన ప్రచార కార్యదర్శి పెంట లింబద్రి , రజక సంఘా సభ్యులు మైలారపు రవి , నవీన్ ,జల్లన్న , మైలారం నవీన్ , మైలారపు గంగాధర్ , మైలారపు నర్సయ్య , గంగాధర్ , నారాయణ ,యువకులు తదితరులు పాల్గొన్నారు.