భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ జోషీ హాజరయ్యారు. మంత్రుల కమిటీ ఈ భేటీలో భూకేటాయింపులపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటారు.