మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్ష
హైదరాబాద్: కేపీఆర్ టెలి ప్రోడక్ట్స్ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రూ.5లక్షల 15వేల రూపాయాల జరిమానా విదించింది. జరిమానా విదించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. కేపీఆర్ సంస్థ ఎండిగా ఉన్నప్పుడు పార్థసారాధిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పై కోర్టుకు వేళ్ళేందుకు బెయిల్ మంజూరి చేయాలని మంత్రి కోరారు. మంత్రి అభ్యర్థనను కోర్టు అనుమతించింది. రూ.పదివేల పూచికత్తులు రెండింటిని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.