మధ్యప్రదేశ్ గవర్నర్ కుమారుడి హత్య
కుమారుడి మృతి వార్తను తట్టుకోలేక..
గవర్నర్ రామ్ నరేష్ యాదవ్‌కు గుండెపోటు
భోపాల్, మార్చి 25: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ మరణించారు. బుధవారం లక్నోలోని తన సొంత ఇంట్లో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఉద్యోగ నియామకాల స్కాంలో శైలేష్ యాదవ్ నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనపై మధ్యప్రదేశ్ పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలుచేశారు.
మరోవైపు కుమారుడి మృతి వార్తను తట్టుకోలేక.. గవర్నర్ రామ్ నరేష్ యాదవ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను భోపాల్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గవర్నర్‌పై కూడా అటవీశాఖ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆ స్కాంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.