మారుతి మనెసార్‌ ప్లాంట్‌ పున:ప్రారంభం

న్యూఢిల్లీ: నెలరోజుల లాకౌట్‌ అనంతం మారుతి మనెసార్‌ ప్లాంట్‌ ఈ రోజు పున: ప్రారంభం అయింది. ప్లాంట్‌లో జూలై 18న కార్మికులు, యాజమాన్యం మధ్య చెలరేగిన ఆందోళనల ఫలితంగా కంపెనీకి చెందిన ఓ సీనియర్‌ ఉద్యోగి మరణించగా 100 మంది గాయపడటంతో కంపెనీ జూలై 21 నుంచి లాకౌట్‌ ప్రకటించింది. ఆందోళనతో సంబంధం ఉన్న 500 పర్మనెట్‌ ఉద్యోగులను విధులనుంచి తొలగించింది. మరో 500 మంది పర్మనెట్‌ ఉద్యోగులను విధులనుంచి  తొలగించింది. దీంతో ఉత్పత్తి ఆగి సంస్థకు 100 కోట్ల నష్టం వాటిల్లింది. తిరిగి ఈ రోజు 300 మంది వర్కర్లతో ప్లాంట్‌లో పనులు ప్రారంభించింది. వీరు సింగిల్‌ షిప్టులో మాత్రమే పనిచేస్తారని కంపెనీ ప్రకటించింది. ఈసందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానా పోలీసులు 500 మందిని ప్లాంటు వద్ద మొహరించారు. వీరుకాక కంపెనీ సొంత సెక్యూరిటీకి చెందిన 100 మంది వ్యక్తులు కాపలాగా నిలుచున్నారు.