మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ లో ఆధునికరణ పనులు

మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ లో ఆధునికరణ పనులు :
మిర్యాలగూడ, జనం సాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) బస్టాండ్ లో ఆధునికరణ  పనులు చురుకుగాకొనసాగుతున్నాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మిర్యాలగూడ బస్టాండుకు ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో బస్టాండ్ ప్రాంగణంలో మిగిలిపోయిన ప్రాంగణ సిసి పనులను చేపట్టే విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎండి సజ్జనార్, రూ. 15 లక్ష రూపాయలు నిధులు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన పిదప పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో మిర్యాలగూడ బస్టాండ్  ప్రాంగణంలో సి.సి. ఆధునికరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.పాల్ నిత్యం పర్యవేక్షిస్తూ.. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని  కోరారు.