ముంబయిలో హాకర్‌ మృతి : వివాదస్పద ఎసీపీ బదిలీ

ముంబయి : ముంబయిలోని శాంతక్రూజ్‌ ప్రాంతంలో పోలీసులు తలపెట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఒక హాకర్‌ గుండెపోటుతో మృతిచెందడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఏసీసీ వసంత్‌దోబ్లెను బదిలీ చేశారు. ఏసీపీ రాకను గమనించిన హాకర్లు పరిగెత్తారని ఈ క్రమంలో ఒక హాకర్‌ తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించడంతో స్థానిక హాకర్లు ఆందోళనకు దిగారు.