ముగిసిన మహాధర్నా: రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద తెదేపా, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధార్న ముగిసింది. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తున్న రైతులు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా. సీపీఐ నేతలను, రైతులను పోలీసుఉలు అరెస్టు చేయడంతో రైతులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.