యశ్వంత్‌పూర్‌-విజయవాడ రైలింజన్లో మంటలు

యశ్వంత్‌పూర్‌-విజయవాడ ప్యాసెంజర్‌ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేగిచర్ల రైల్వే స్టేషన్‌ సమీపంకు రైలు చేరుకోగానే రైలు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ రైలును ఆపగానే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు మంటలను అదుపు చేసి ప్రమాదం తప్పించారు.