యూపీ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌ వ్వవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఓ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ముజఫర్‌నగర్‌ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన నేరంలో బ్యాంక్‌ మేనేజర్‌ మహేందర్‌ సింగ్‌తో పాటు పలు విభాగాలకు చెందిన 11 మంది అధికారులు నిందితులు. వీరు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.