రంగలీల మైదానం సందర్శించిన డిసిపి అశోక్ కుమార్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు రంగలీల మైదానంలో వచ్చేనెల మూడున సదుల బతుకమ్మ ఐదున దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో అలాగే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన విషయాలలో తగిన ఏర్పాట్ల గురించి వరంగల్ డిసిపి అశోక్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వేలాదిగా వచ్చే భక్తులు ట్రాఫిక్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి కలకోట గిరి కుమార్, దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు నాగపూరి సంజయ్ బాబు , వడ్నాల నరేందర్, వంగరి కోటి, సుంకర సంజీవ్, గోనె రాంప్రసాద్, సందీప్, క్రాంతి, రాజు, రంజిత్, చిరంజీవి, వెంకన్న, స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.