రాష్ట్రంలో తగ్గిన నక్సలైట్ల సంఖ్య

నాగర్‌కర్నూల్‌:  రాష్ట్రంలో నక్సలైట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని డీజీపీ దినేష్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని పీఆర్‌ అతిధిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట సంఘటనలో ఇద్దరు నిందితులను గుర్తించామని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని తెలియజేశారు. పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కేసులు 27.5 శాతానికి తగ్గాయని  తెలిపారు.