రాష్ట్రపతి అభ్యర్థుల బరిలో కొత్త పేర్లు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన నేపధ్యంలో ఈ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని కొందరు భావిస్తే మరో పక్క కొత్త పేర్లను తెర పైకి తెస్తుంది మరో వర్గం. సీనియర్‌ నేత కరణ్‌సింగ్‌ పూరును కాంగ్రెస్‌ సీరియస్‌ గా పరిగణిస్తోందని కొందరు అంటున్నారు. అయితే వామపక్ష నేత బర్దన్‌, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌లు అందుకు ఇష్ట పడడం లేదన్నది సమాచారం. ఈ రోజు సోనియాతో మమతాబెనర్జీ భేటీ కానున్న నేపథ్యంలో కొత్తగా ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత మొహిసినా కిద్వాయ్‌ పేరు లిస్టులో చేరింది. ఆమె నైతే మమత కాని వ్యతిరేకించక పోవచ్చన్నది ఒక అభొప్రాయం. మాజీ లోక్‌ సభ స్పీకర్‌ సోమనాధ్‌ చటర్జీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.