రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత లేదు: వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత తమ పార్టీకి లేదని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు. బుధవారం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్‌చౌక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడున్న జాతీయ పార్టీలన్నీ తొలుత ఒకరిద్దరు సభ్యులతోనే ప్రస్థానాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనపై సభలో చర్చకు నోటీసులు ఇచ్చామని చెప్పారు.