రెండో ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ‘రెలిగేర్‌’

హైదరాబాద్‌: బ్యాంకింగేతర ఆర్థిక రంగంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నిస్తున్న రెలిగేర్‌ సంస్థ వరుసగా రెండో ఏడారి పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను తమ సంస్థ పబ్లిక్‌ ఇష్యూలోకి అడుగుపెట్టిందని సంస్థ సభ్యులు తెలిపారు. వెయ్యి రూపాయిల విలువ కలిగిన షేర్లపై కనీసం 10వేల రూపాయాల స్థాయినుంచి ఇష్యూలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14నుంచి ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 27తో ముగుస్తుంది.