రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. పదిహేను కార్మిక సంఘాలు పోటీ చేస్తున్న ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బెల్లంపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాల్‌పల్లి, గోదారిఖని, శ్రీరాంపూర్‌ మొదలైన పదరొండు ప్రాంతాల్లో 95 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 63,950 మంది కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.