రేపు ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేయనుంది. ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రవేశాల ప్రక్రియ జరుగనుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది.ఆప్షన్లను మార్పునకు సెప్టెంబర్ 9, 10 తేదిల్లో అవకాశం కల్పిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 12న సాయంత్రం 6 గంటల లోపు సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పటు చేస్తామని చెప్పింది. విద్యార్థులందరికీ ఒకే ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది.