రైతులను ఆదుకోవాలని వినతిరైతులను ఆదుకోవాలని వినతి
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 20.(జనంసాక్షి). ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాలు వడగళ్ల మూలంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు పంట చేతికి వచ్చే దిశలో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా Sc సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, చొప్పదండి ప్రకాష్, కాసర్ల రాజు, జాలగం ప్రవీణ్, పాసుల వెంకటేష్, జడ్పీటీసీ నాగం కుమార్, పండుగ ప్రదీప్, గంభీరావుపేట ప్రశాంత్, అరపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.