రైతులపై కెసులు పెట్టవద్దు:సీఎం

తూర్పుగోదావరి:రైతులు తీసుకున్న పంటరుణాలపై వడ్డీ మాఫీ చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన మాట్టాడుతూ రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని ప్రకటించారు.ఈ విషయంలో రైతులు పై కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం సంబందిత అధికారులను ఆదేశించారు.స్వామినాదన్‌ కమిషన్‌ నివేదికను అమలు పరచాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు.కోనసీమలో కోకోనట్‌ బోర్డు కావాలని కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.