లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలియజేశారు. 15 ప్లాటూన్ల పారా మిలిటరీ, రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.  పురానీ హవేలీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ  తెలిపారు.