లోయలో పడిన పాఠశాల బస్సు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్యార్గ్‌ వద్ద ఓ స్కూలు బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. ఒక టీచరు, ఒక విద్యార్థి మృతిచెందగా, మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. సమాచారం అందగానే అధికారులు సహాయకచర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రిలో చేర్పించారు.