వంటకోసం వచ్చిన మహిళలపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో ఘటనపై బాధిత మహిళల ఫిర్యాదు
భోపాల్,నవంబర్19(జనం సాక్షి ): ఇద్దరు మహిళలపై వేర్వేరుగా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని రaలావర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను పెండ్లి వేడుకలో వంటల కోసం మధ్యప్రదేశ్‌లోని మెయిన్‌పురి ప్రాంతానికి పిలిపించారు. ఇందర్ మాలి, అతడి అనుచరులు నేత్రమ్ విూనా, అక్మల్ విూనా ఆ ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని వారిని బెదిరించారు. అనంతరం బాధిత మహిళలను దాదూని గ్రామానికి తరలించి విజేంద్ర సింగ్ అనే వ్యక్తికి అప్పగించారు. అక్కడ విజేంద్ర సింగ్‌తోపాటు మరో వ్యక్తి ఆ ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీని గురించి ఎవరికీ చెప్పబోమని హావిూ తీసుకున్న తర్వాత ఆ ఇద్దరు మహిళలను విడిచిపెట్టారు.అయితే, బాధిత మహిళలు మెయిన్‌పురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమపై జరిగిన రెండు సామూహిక లైంగిక దాడులకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.