విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది

హైదరాబాద్‌: పత్తి విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించిందని ఎంపి రాజయ్య వెల్లడించారు. రైతులంతా మహికో విత్తనాలనే కోరుకోవడం వల్లనే కొరత కన్పిస్తోందని, ప్రత్యామ్నాయ విత్తనాల పైనా విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు. కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని దీని కోసం అదనంగా విత్తనాలు ఇక్కడికి సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని అధికారలు వెల్లడించినట్లు వివరించారు.