విద్యానగర్ లో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం
విద్యానగర్ లో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బేబిమూన్ పాఠశాల వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలను అభినందించారు.ఎక్కువగా విద్యావంతులు, వ్యాపారులుండే విద్యానగర్ నందు అన్ని పండుగలను ఐకమత్యంతో నిర్వహించుకోవడం హర్షణీయమన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ చిలుముల శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు.భక్తులకు అన్నదానం నిర్వహించిన వార్డ్ కౌన్సిలర్ దండూరి పావని కృపాకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ కు అభినందనలు తెలిపారు.వాసవి యూత్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, నాయకులు వాంకుడోతు పద్మ వెంకన్న,రాచకొండ శ్రీనివాస్, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్,బెజగం ఫణి,వంగవీటి రమేష్, జూలకంటి నాగరాజు, యామా సంతోష్, శ్రీరంగం రాము, గుమ్మడవెళ్లి శ్యామ్ సుందర్, మంచాల శ్రీనివాస్ గుప్త, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.