విద్యుత్‌ ఆదా చేసేందుకు చర్యలు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 124 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగొలు చేస్తున్నట్టు దీనికి ప్రలతిరోజు రూ. 14 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు సెంట్రల్‌ పవర్‌నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని కోరినట్లు ఆయన చెప్పారు. తమిళనాడులోని ఆణువిదు&్యత్‌ కేంద్రంనుంచి సాధ్యమైనంతవరకు విద్యుత్‌ను కేటాయించాలని కోరినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్‌ ఆదా చేసేందుకు చర్యలను తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. 2006 తలసరి విద్యుత్‌ వినియోగం 604 యూనిట్లు వుంటే ఇప్పుడడు రెట్టింపు అయిందన్నారు. వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటల విద్యుత్‌ సరఫరా వుండే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాన్‌సకోను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.