*వివాహ వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం*

కోదాడ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) ఈరోజు యాదా శ్రీనివాసరావు మీనా కుమారీ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా
పట్టణం,లోని రంగా థియేటర్ లో స్వర్ణ భారతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది, ప్రజలూ అన్నదానాన్ని స్వీకరించారు.అనంతరం శ్రీనివాసరావు మీనా కుమారి దంపతులను ఆశీర్వదించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదాతా సుఖీభవ అని దీవించారు. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలు కోరారు,అనంతరం ట్రస్ట్ వారి సేవలు చిరస్మరణీయం.అని వారి సేవలు మరువలేని కొనియాడారు.ఇలాంటి సేవా కార్యక్రమాలుఎన్నెన్నో చేయాలనికోరుకుంటున్నామనిఅన్నారు. ట్రస్టు సభ్యులు, అధ్యక్షులు గాదం శ్రీనివాసరావు, సుధాకర్, రంగ ముక్తేశ్వరరావు, గండేల సూర్యనారాయణ, మైస రాంబాబు, సాయి, సాంబశివరావు, మధు, కోటి తదితరులు పాల్గొన్నారు.