*శంషాబాద్ లో ఘనంగా గణేష్ నిమర్జనం వేడుకలు*

*రాజేంద్రనగర్. ఆర్.సి(జనం సాక్షి) నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలోని వినాయకులను కళాకారుల వృత్యాలతో, తీన్మార్ డాన్స్ లతో, దేవతామూర్తుల వేషధారణలతో గణేష్ మండపాల నుండి కాముని చెరువు వరకు బారులు తీరి కాముని చెరువులో వినాయకులను నిమర్జనం చేశారు. ఈ నిమజ్జనం వేడుకలకు ముఖ్యాతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్.
ఈ వేడుకలలో 6వ వార్డు కౌన్సిలర్ జాంగిర్ ఖాన్ మతసామరస్యానికి ప్రతికగా నిమర్జనం లో పాల్గొని భక్తులకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు అజయ్,జహంగీర్ ఖాన్, శ్రీకాంత్ యాదవ్, విజయలక్ష్మి, కొనమొల భారతమ్మ,సంజయ్ యాదవ్,నాయకులు గణేష్ గుప్త, మురళీ యాదవ్, కొనమొల శ్రీనివాస్, అంజద్, తాజ్ బాబా, హన్మంతు, పవన్ గౌడ్, నర్సింహా గౌడ్,హన్మంతు, మోహన్ రావు,వీరేందర్ రెడ్డి, రాహుల్, ఇంద్రాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్ : గణేష్ నిమర్జనం వేడుకల లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి.
Attachments area