శాండీ తుపాను బీభత్సం..45కు చేరిన మృతుల సంఖ్య

న్యూయార్క్‌: ‘శాండీ’ తుపాను అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను దాటికి ఇప్పటి వరకై వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరింది. న్యూయార్క్‌ ప్రాంతంలోనే 18 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు శాండీ ప్రభావంతో 80 లక్షలకుపైగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి 16 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. 124 ఏళ్ల తర్వాత వరుసగా రెండో రోజు న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ పనిచేయలేదు. ముందుజాగ్రత్త చర్యగా మూడు అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేశారు. న్యూజెర్సీలో అధికంగా నివసించే భారతీయ కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.