శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటాం : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: ఓయూ విద్యార్థిని అరుణ హత్యకు కారణమైన శివకుమార్‌ను త్వరలోనే పట్టుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం అరుణ తల్లి , మహిళా సంఘాలు, విద్యార్థులు సబితను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని పోలీస్‌ కమిషనర్‌ సబిత ఆదేశాలు జారీ చేశారు.