శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు : ఎస్పీ

అనంతపురం : కనగానపల్లి కాంగ్రెస్‌ నేత సుధాకర్‌రెడ్డి హత్య కేసులో పరిటాల రవితనయుడు శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ షానవాజ్‌ ఖాసిం తెలియజేశారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే శ్రీరామ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అతన్ని పట్టుకునేందుకు  మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు  అనంతపురంతోపాటు కర్ణాటకలోనూ గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.