షిండేతో పెద్దిరెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాల్సివస్తే మూడు రాష్ట్రాలుగా చేయాలని షిండేలను కోరినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే సీమాంథ్రలో రాయలసీమవాసులు నష్టపోతారని స్పష్టం చేసినట్లు తెలియజేశారు.