సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌
న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న విషయాన్ని అమీర్‌ఖాన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని మన్మోహన్‌ హామీ ఇచ్చారని అమీర్‌ ఖాన్‌ తెలిపారు. చేతులతో అశుద్ధాన్ని ఎత్తివేసే పద్ధతి మాన్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ప్రధాని సానుకూలంగా స్పందించారన్న అమీర్‌ ఖాన్‌ కేంద్ర ప్రభుత్వం తీసుకోబేయే చర్యలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. సత్యమేవజయతే పేరుతో అమీర్‌ఖాన్‌ నిర్వహిస్తున్న టీవీ షోలో గల ఆదివారం ఈ అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్‌ ప్రధానిని కలిశారు.