సమర్థులు వస్తే బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు

హైదరాబాద్‌: సమర్థులు వస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు ఇస్తానని తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. తమ బీసీ డిక్లరేషన్‌ను విమర్శిస్తున్నవాళ్లు తమకంటే బీసీలకు బెస్ట్‌ పాలసీ ప్రకటించి శభౄష్‌ అనిపించుకోవాలని సవాలు చేశారున. వెనుకబడిన వర్గాల సంక్షేమం విషయంలో వెనక్కుపోయే ప్రసక్తి లేదన్నారు .బీసీ డిక్లరేషన్‌ ఎలా సాధ్యమో చేసి చూపుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఈరోజు వివిధ బీసీ సంఘాల నేతలు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.