సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్‌ కార్యదర్శి రాజ సులోచన మాట్లాడుతూ అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కార్యకర్తలు నగరంలో జనాభా లెక్కలు సర్వే చేసినప్పటికీ ఇప్పటి వరకు అందించాల్సిన డబ్బులను చెల్లించలేదన్నారు. రెండు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సెంటర్‌ అద్దెలను పెంచాలని, కట్టెల బిల్లులు పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. గత దశాబ్ద కాలంలోఇళ్ల స్థలాలు కావాలని అనేక వినతులు సమర్పించినా ఇప్పటి వరకు మంజూరు చేయలేదని, సంబంధం లేని సెక్టార్లకు ఇంచార్జీలుగా నియమిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తహసీల్ధార్‌ ఓటరు గణనకి కార్యకర్తలను ఉపయోగించుకుని ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. యూనియన్‌ అధ్యక్షురాలు హైమావతి, ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, లలిత, సిఐటియు నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్‌, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సందీపన తదితరులు పాల్గొన్నారు.